భారతదేశంలో ఉన్న మన సంస్కృతి సాంప్రదాయాలు గౌరవిస్తూ ఎన్నోవేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వైదిక హిందూ ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ హిందూ కుటుంబాల అభ్యున్నతికి దోహదపడటమే హిందూ ధార్మిక పీఠం స్థాపన ముఖ్య ఉద్దేశ్యము.
హిందూ ధార్మిక పీఠం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ బంధువులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాల గురించిన విషయాలను విశేషాలను తెలియజేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడటమే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా హిందువుల పుట్టినరోజు, పెళ్లిరోజు తో పాటు మీ ఇంట్లో శుభకార్యములు జరిగే రోజున ఉచితముగా ఆశీర్వచనాలు అందిస్తుంది హిందూ ధార్మిక పీఠం.
ఈ కలియుగంలో లోక సంరక్షణలో భాగంగా అన్న శాంతి కొరకు పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకునే భక్తుల పేరిట అన్నదానం నిర్వహించబడుతుంది.
సకల దేవతా స్వరూపం గోమాత యొక్క ఆశీస్సులు హిందూ బంధువులందరికీ కలగాలనే సదుద్దేశంతో గో సంరక్షణ చేస్తూ గోశాల, గోవుల హాస్టల్ నిర్వహిస్తోంది హిందూ ధార్మిక పీఠం.
అన్నిటికీ వేదం మూలం, ప్రమాణం అటువంటి వేదం భవిష్యత్ తరాలకు అందించాలని సంకల్పంతో వేద పాఠశాల నిర్వహించడం కూడా హిందూ ధార్మిక పీఠం ముఖ్య లక్ష్యం.
అనాధ శరణాలయం, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయుట ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుట, స్త్రీ శిశు సంక్షేమానికి తోడ్పాటు చేయుట వంటివి హిందూ ధార్మిక పీఠం నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగము.
అనేకమైన పుణ్యక్షేత్రాలకు భక్తులను తీసుకువెళ్ళుట, వైదికపరమైన కార్యక్రమాలకి చేయూత ఇవ్వటం, ఉచిత ఉపనయన, వివాహ కార్యక్రమాలు నిర్వహించడం.
దేవతల యొక్క అనుగ్రహం తో పాటు పితృదేవతల యొక్క ఆశీర్వచనములు కూడా అందరికీ ఉండాలి అనే సదుద్దేశంతో పితృ తర్పణములు, పిండ ప్రధానములు విశేషమైన మోక్ష క్షేత్రాలలో తోపాటు గయ, ప్రయాగ, కాశీ, పాదగయ వంటి క్షేత్రాలలో హిందూ ధార్మిక పీఠం ద్వారా నిర్వహించబడును.
విశ్వశాంతి కొరకు సకలజనుల శ్రేయస్సు కొరకు అతివృష్టి అనావృష్టి లాంటి దుర్భిక్షముల నుండి బయటపడుటకు అనేకమైన యజ్ఞ యాగాది క్రతువులు ను హిందూ ధార్మిక పీఠం నిర్వహిస్తుంది.
హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సన్నిధిరాజు విజయ్ కుమార్ శర్మ గురువు గారు.
గురువు గారు అనేకమైన వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ బంధువుల శ్రేయస్సు కోరి లోక కళ్యాణార్థం 12 మంది పీఠాధిపతులను ఇద్దరు స్వామీజీలను ఆహ్వానించి విశేషమైన కుంభాభిషేక మహోత్సవాన్ని 14 రోజులపాటు నిర్వహించడం, భక్తుల కామ్యములు సిద్ధించి సుఖమయ జీవనం సాగించుట కొరకు 14 విశేషమైన ప్రత్యేక కామ్య హోమములు నిర్వహించి తాను తరించి భక్తులను తరింపజేసినారు.
స్త్రీ మూర్తుల సౌభాగ్యం కాంక్షించి అనేకమైన స్త్రీల వ్రతాలు, నోములను అందరికీ అందుబాటులో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
సామూహికముగా లక్ష వత్తుల నోములు, షష్టిపూర్తి వంటి అనేక విశేషమైన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
సాంప్రదాయ జ్యోతిషంలో విశేషమైన పరిజ్ఞానంతో గురువుగారి వంశములో సుమారు 5 తరముల నుండి జ్యోతిష్య శాస్త్రం ద్వారా కొన్ని వేల మంది హిందూ బంధువులకు తగు సూచనలు చేస్తూ పరిష్కార మార్గాలు సూచిస్తూ వారి కుటుంబాల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతున్నారు.
వాస్తు శాస్త్రంలో పరిజ్ఞానాన్ని పొంది ఎంతోమందికి గృహ నిర్మాణాలలో వాస్తు సంబంధమైన దోషములు లేకుండా తగు సూచనలు చేస్తూ అనేక మంది అభ్యున్నతికి పాటుపడుతున్నారు.
అదేవిధంగా హిందూత్వం పైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద విశేషమైన గౌరవంతో అనేకమైన ధర్మసందేహాలు నివృత్తి చేస్తూ మానవసేవే మాధవసేవ అని భావించి నిత్య నైమిత్తిక కార్యక్రమాల తోపాటుగా భక్తులందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన జీవితాన్ని హిందూ ధార్మిక పీఠం ద్వారా హిందూ బంధువులకు అంకితమిస్తున్నారు.
హిందూ ధార్మిక పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సన్నిధిరాజు విజయ్ కుమార్ శర్మ గురువు గారు. గురువు గారు అనేకమైన వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ బంధువుల శ్రేయస్సు కోరి లోక కళ్యాణార్థం 12 మంది పీఠాధిపతులను ఇద్దరు స్వామీజీలను ఆహ్వానించి విశేషమైన కుంభాభిషేక మహోత్సవాన్ని 14 రోజులపాటు నిర్వహించడం, భక్తుల కామ్యములు సిద్ధించి సుఖమయ జీవనం సాగించుట కొరకు 14 విశేషమైన ప్రత్యేక కామ్య హోమములు నిర్వహించి తాను తరించి భక్తులను తరింపజేసినారు. స్త్రీ మూర్తుల సౌభాగ్యం కాంక్షించి అనేకమైన స్త్రీల వ్రతాలు, నోములను అందరికీ అందుబాటులో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సామూహికముగా లక్ష వత్తుల నోములు, షష్టిపూర్తి వంటి అనేక విశేషమైన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సాంప్రదాయ జ్యోతిషంలో విశేషమైన పరిజ్ఞానంతో గురువుగారి వంశములో సుమారు 5 తరముల నుండి జ్యోతిష్య శాస్త్రం ద్వారా కొన్ని వేల మంది హిందూ బంధువులకు తగు సూచనలు చేస్తూ పరిష్కార మార్గాలు సూచిస్తూ వారి కుటుంబాల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. వాస్తు శాస్త్రంలో పరిజ్ఞానాన్ని పొంది ఎంతోమందికి గృహ నిర్మాణాలలో వాస్తు సంబంధమైన దోషములు లేకుండా తగు సూచనలు చేస్తూ అనేక మంది అభ్యున్నతికి పాటుపడుతున్నారు. అదేవిధంగా హిందూత్వం పైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద విశేషమైన గౌరవంతో అనేకమైన ధర్మసందేహాలు నివృత్తి చేస్తూ మానవసేవే మాధవసేవ అని భావించి నిత్య నైమిత్తిక కార్యక్రమాల తోపాటుగా భక్తులందరికీ అందుబాటులో ఉంటూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన జీవితాన్ని హిందూ ధార్మిక పీఠం ద్వారా హిందూ బంధువులకు అంకితమిస్తున్నారు.